Header Banner

ప్రతిపక్షం పోటీలో లేదు కదా అని నిర్లక్ష్యం వద్దు..! పార్టీ నేతలకు లోకేశ్ కీలక మార్గదర్శకం!

  Tue Feb 18, 2025 23:16        Politics

ప్రతిపక్షం పోటీలో లేదు కదా అని నిర్లక్ష్యం వద్దు.. పార్టీ నేతలంతా వచ్చే వారం రోజులు చురుగ్గా పనిచేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయగోదావరి, గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి లోకేశ్ ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ లోగా ప్రతి ఓటరును పార్టీ నేతలు నేరుగా కలిసి అభ్యర్థులను గెలిపించేలా చొరవ చూపాలన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలు కీలక భూమిక వహించాలని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషిచేయాలని అన్నారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


కూటమి నేతలను కలుపుకొని వెళుతూ ప్రచారం సాగించాలన్నారు. టెలీ కాలింగ్, ఐవీఆర్ఎస్ ద్వారా ఓట్లను అభ్యర్థించాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 67 నియోజకవర్గాల్లో క్లస్టర్ స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు సీరియస్ గా తీసుకోవాలన్నారు. రేపటి నుంచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రణాళిక అమలుచేస్తున్నామని చెప్పారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ సుజయకృష్ణ రంగారావు, మంతెన సత్యనారాయణరాజు, దామచర్ల సత్య, పెళ్లకూరి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అశోక్ బాబు, ఏఎస్ రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NDA #mlc #elections #Naralokesh #todaynews #flashnews #latestupdate